: తెలంగాణలోని ప్ర‌భుత్వ ఆసుప‌త్రులపై డ్ర‌గ్ కంట్రోల్ అధికారుల దాడులు


ఇటీవ‌ల స‌రోజ‌నీదేవి కంటి ఆసుప‌త్రిలో కాలం చెల్లిన సెలైన్ వాడడం వల్ల పలువురు కంటిచూపు సమస్యలు ఎదుర్కున్న నేప‌థ్యంలో తెలంగాణలోని ప్ర‌భుత్వ ఆసుప‌త్రులపై డ్ర‌గ్ కంట్రోల్ అధికారులు దాడులు మొద‌లుపెట్టారు. నిన్న హైదరాబాద్ లోని నిలోఫర్ పిల్లల ఆసుపత్రిలోనూ బ్యాక్టీరియా సెలైన్ బాటిళ్లు ఉన్నట్లు డ్రగ్ కంట్రోల్ విభాగం అధికారుల తనిఖీల్లో బయటపడిన విష‌యం తెలిసిందే. ఈరోజు ఉద‌యం నుంచి తెలంగాణ‌లోని ప‌లు ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో అధికారులు శ్యాంపిల్స్ సేక‌రిస్తున్నారు. మ‌రోవైపు స‌రోజ‌నిదేవి ఆసుప‌త్రిలో సెలైన్ స‌ర‌ఫ‌రా చేసిన ఫార్మా కంపెనీని అధికారులు బ్లాక్‌లిస్ట్‌లో పెట్టి, స‌ద‌రు కంపెనీకి నోటీసులు జారీ చేశారు.

  • Loading...

More Telugu News