: మత పెద్దలైనంతమాత్రాన ఏదిపడితే అది మాట్లాడకూడదు: 'జకీర్ నాయక్‌'పై లాలూ ఆగ్రహం


బంగ్లాదేశ్ లోని బేకరీపై విరుచుకుపడ్డ ఉగ్రవాదుల్లో ఇద్దరు భారతీయ ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్‌ అనుచరులు ఉన్నారని తెలియడం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు ఆగ్రహం తెచ్చింది. దీంతో లక్నోలో ఆయన మాట్లాడుతూ, జకీర్ నాయక్ లాంటి వ్యక్తులు సమాజంలో సమస్యలు సృష్టిస్తారని అన్నారు. మత బోధకులు భక్తులనుద్దేశించి ప్రసంగాలు ఇచ్చేముందు ఓపిక, సహనం పాటించాలని సూచించారు. మత పెద్దలమన్న అహంకారంతో ఏది పడితే అది మాట్లాడటం సరికాదని ఆయన అన్నారు. అవగాహనా రాహిత్యంతో మాట్లాడి, భక్తులను గందరగోళానికి గురిచేయడం సరికాదని ఆయన హితవు పలికారు. గందరగోళంలో ఉండే భక్తులను సరైన దారిలో నడిపించేది మతమని ఆయన తెలిపారు. దీనిని ప్రతి మతగురువు తెలుసుకోవాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News