: గడప గడపకూ వెళ్లే కార్యక్రమానికి రేపు శ్రీ‌కారం చుడ‌తాం: బొత్స స‌త్య‌నారాయ‌ణ‌


వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్‌లోని ప్ర‌తీ ఇంటి గడప గడపకూ వెళ్లే కార్యక్రమానికి రేపటి నుంచి శ్రీ‌కారం చుడ‌తార‌ని ఆ పార్టీ నేత‌ బొత్స స‌త్య‌నారాయ‌ణ తెలిపారు. ఈరోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ‘గ‌డ‌ప గ‌డ‌ప‌కు వైఎస్సార్’ కార్య‌క్ర‌మంలో పాల్గొంటూ చంద్ర‌బాబు వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డ‌తారని అన్నారు. రెండేళ్ల చంద్ర‌బాబు పాల‌న‌లో రాష్ట్రానికి చేసిందేమీ లేద‌ని ఆయ‌న అన్నారు. ఈ విష‌యమే ప్ర‌జ‌లకు చేర‌వేస్తామ‌ని ఆయ‌న చెప్పారు. రేపు దివంగత వైఎస్సార్ జ‌యంతిని ఘ‌నంగా నిర్వ‌హిస్తామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. వైఎస్సార్‌ ఆశ‌య‌ సాధ‌న‌కు పాటుప‌డ‌తామ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News