: హెచ్ ఆర్డీ మినిస్టర్ గా జవదేకర్ బాధ్యతల స్వీకరణ!.. డుమ్మా కొట్టిన స్మృతి ఇరానీ!
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్ నేటి ఉదయం బాధ్యతలు స్వీకరించారు. తన కేబినెట్ లోని మంత్రుల్లో జవదేకర్ ను నిజయతీపరుడిగా భావించిన ప్రధాని నరేంద్ర మోదీ మొన్నటి కేబినెట్ విస్తరణలో ఆయనకు ఒక్కరికే ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కేబినెట్ మార్పులు చేర్పుల్లో భాగంగా నిన్నటిదాకా హెచ్ ఆర్డీ మినిస్టర్ గా బాధ్యతలు నిర్వర్తించిన స్మృతి ఇరానీ నిన్ననే తనకు కేటాయించిన జౌళి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే నేడు జవదేకర్ కు తన పాత శాఖ బాధ్యతలను అప్పగించేందుకు మాత్రం ఆమె రాలేదు. స్మృతి ఇరానీ లేకుండానే జవదేకర్ హెచ్ ఆర్డీ మినిస్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. స్మృతి ఇరానీ గైర్హాజరీపై ప్రశ్నించిన మీడియాకు కుటుంబ కారణాల వల్లే ఆమె రాలేకపోయారని జవదేకర్ చెప్పారు.