: సరోజనీదేవి కంటి ఆసుపత్రి వైద్యులపై కేసు నమోదు
హైదరాబాద్ లోని సరోజనీ దేవి కంటి ఆసుపత్రి ఘటనకు సంబంధించి వైద్యులపై కేసు నమోదైంది. వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న బాధితుల ఫిర్యాదుపై హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఐపీసీ సెక్షన్ 338 కింద కేసు నమోదు చేశారు. కాగా, సరోజనీ దేవి కంటి ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్న 13 మంది రోగుల్లో ఏడుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న విషయం తెలిసిందే. కళ్లు శుభ్రం చేసేందుకు వాడే సెలైన్ బాటిల్ లో బ్యాక్టీరియా ఉన్నందువల్లే రోగులు కంటి చూపు కోల్పోయే ప్రమాదం సంభవించిందని విచారణాధికారి డాక్టరు రవీందర్ గౌడ్ పేర్కొన్న విషయం తెలిసిందే.