: అసదుద్దీన్ మతరాజకీయాలు చేస్తుంటే ప్రభుత్వాలు చూస్తూ ఊరుకుంటున్నాయి: కిషన్ రెడ్డి


ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మత రాజకీయాలు చేస్తుంటే తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలు చూస్తూ ఊరుకుంటున్నాయని బీజేపీ నేత కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఒవైసీ తీవ్రవాదులకు అండగా నిలుస్తున్నారని అన్నారు. ఆయన ప్రకటనలపై సీబీఐ దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 'తీవ్రవాదులకు న్యాయం సాయం చేస్తానని ఆయన బహిరంగ ప్రకటన చేస్తారు... అలాగే ఎన్ కౌంటర్ లో మరణించిన నేరగాళ్ల అంత్యక్రియల ర్యాలీల్లో పాల్గొని వారికి మద్దతు తెలుపుతారు. అందుకే ఎంఐఎం అధినేతకు తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయో లేదో దర్యాప్తులో నిగ్గుతేల్చాలి' లని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించుకుని చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News