: ఐఎస్ దుర్మార్గం!... వాట్సాప్, టెలిగ్రామ్ లలో 12 ఏళ్ల బాలికలను అమ్మకానికి పెట్టిన వైనం!
షరియా చట్టాలు పక్కాగా అమలయ్యేలా ప్రత్యేక ‘కాలిఫేట్’ రాజ్యాన్ని స్థాపిస్తామని రంగంలోకి దిగిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు తమ లక్ష్యాన్ని చేరుకోలేకపోవడమే కాకుండా అత్యంత దారుణాలకు పాల్పడుతూ ఇస్లామిక్ మతాచారాలను మంట గలుపుతున్నారు. యాజీదీ మహిళలను చెరబట్టి బానిసలుగా మార్చేసిన ఐఎస్ ముష్కరులు... తాజాగా మరో దారుణానికి ఒడిగట్టారు. ముక్కుపచ్చలారని 12 ఏళ్ల బాలికలను అమ్మేస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు పోస్ట్ చేస్తున్నారు. ఈ మేరకు వారు రూపొందించిన యాడ్స్ ప్రస్తుతం వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా సైట్లలో దర్శనమిస్తున్నాయి. ‘‘కన్యగా ఉన్న అందమైన 12 ఏళ్ల వయసు బాలిక ధర ప్రస్తుతానికి 12,500 డాలర్లకు చేరుకుంది. త్వరలోనే విక్రయించేస్తాం’’ అంటూ ఐఎస్ ముష్కరులు పెట్టిన యాడ్ ప్రస్తుతం కలకలం రేపుతోంది.