: వెంకయ్య చేతికి మరో కీలక శాఖ!.... హెచ్ ఆర్డీ నుంచి స్మృతి ఔట్!


నిన్నటి కేంద్ర కేబినెట్ విస్తరణ కొందరు మంత్రులకు షాకివ్వగా మరికొందరు మంత్రులకు మాత్రం మరింత బూస్టిచ్చింది. తెలుగు నేలకు చెందిన కీలక రాజకీయవేత్త ముప్పవరపు వెంకయ్యనాయుడుకు నిన్నటి విస్తరణ ఫలితంగా మరింత ప్రాధాన్యం దక్కినట్లైంది. ఇప్పటికే కీలకమైన పట్టణాభివృద్ధి శాఖతో పాటు గృహ నిర్మాణ శాఖ, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ కూడా ఆయన చేతిలోనే ఉన్నాయి. తాజాగా కీలకమైన సమాచార, ప్రసార శాఖ కూడా ఆయన చేతిలోకే వచ్చేసింది. ఫలితంగా అత్యధిక సంఖ్యలో కీలక శాఖల బాధ్యతలను మోస్తున్న కేంద్ర మంత్రిగా ఆయన మరో మెట్టు పైకెక్కినట్లైంది. ఇక బీజేపీలో మరో కీలక నేతగా ఉన్న ప్రకాశ్ జవదేకర్ ను కేబినెట్ లోకి తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ... ఆయనకు కీలకమైన మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (హెచ్ ఆర్డీ)ని కేటాయించారు. రవిశంకర్ ప్రసాద్ కు ప్రమోషన్ ఇస్తున్నట్లుగా న్యాయ శాఖకు మార్చారు. ఇక ఇప్పటిదాకా హెచ్ ఆర్డీ శాఖ మంత్రిగా ఉన్న బీజేపీ మహిళా నేత స్మృతి ఇరానీకి ఈ కేబినెట్ విస్తరణ పెను షాక్ ఇచ్చిందనే చెప్పాలి. హెచ్ ఆర్డీ శాఖను ఆమె నుంచి తప్పించిన మోదీ... తాజాగా ఆమెను జౌళి శాఖకు మార్చారు. బీజేపీలో మరో కీలక నేతగా ఉన్న సదానంద గౌడకు కూడా ఈ కేబినెట్ విస్తరణ షాకిచ్చింది. ఇప్పటిదాకా న్యాయ శాఖ మంత్రిగా ఉన్న ఆయనను గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖకు మార్చారు.

  • Loading...

More Telugu News