: దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులను ఆందోళనకు గురిచేసిన మతిస్థిమితంలేని వ్యక్తి


నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు ఉద‌యం ఓ వ్య‌క్తి అల‌జ‌డి రేపాడు. ఎటు నుంచి వ‌చ్చాడో తెలియ‌దు కానీ, ఆసుప‌త్రిలోకి ప్ర‌వేశించి వీరంగం సృష్టించాడు. ఆసుప‌త్రిలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేస్తూ రోగుల‌ను ఆందోళ‌న‌కు గురిచేశాడు. ఆసుప‌త్రిలో హ‌ల్‌చ‌ల్ చేస్తోన్న వ్య‌క్తికి మ‌తిస్థిమితం లేద‌ని రోగుల బంధువులు, ఆసుప‌త్రి సిబ్బంది గ‌మ‌నించి, ఎట్ట‌కేల‌కు ఆ వ్య‌క్తిని ప‌ట్టుకొన్నారు. ఆ వ్య‌క్తిని బంధించి, పోలీసులకి అప్ప‌జెప్పారు.

  • Loading...

More Telugu News