: ‘ఉగ్ర’ నిధుల కోసం భార్య నగలమ్మిన హైదరాబాదీ ఐఎస్ టెర్రరిస్ట్!
భాగ్యనగరి హైదరాబాదు సహా ఏపీ, దేశంలోని పలు ప్రాంతాల్లో భీకర దాడులకు ప్లాన్ చేసి ఇటీవలే పోలీసులకు చిక్కిపోయిన ఐదుగురు ఐఎస్ ఉగ్రవాదులకు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. గత బుధవారం హైదరాబాదులోని పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ఏక కాలంలో దాడులు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మొత్తం 11 మంది అనుమానితులను అరెస్ట్ చేసింది. వారిలో ఐదుగురు ఉగ్రవాదులను గుర్తుపట్టిన అధికారులు మిగిలిన వారిని వదిలేశారు. ఆ తర్వాత ఐదుగురిని కోర్టులో హాజరుపరిచిన ఎన్ఐఏ... కోర్టు అనుమతితోనే వారిని 12 రోజుల పాటు తమ కస్టడీకి తీసుకుంది. ఈ నేపథ్యంలో కొనసాగుతున్న విచారణలో భాగంగా ఐదుగురు ఉగ్రవాదుల్లోకి ఓ ముష్కరుడు... ఉగ్రవాద దాడికి సంబంధించిన ఖర్చుల కోసం సాక్షాత్తు తన భార్య నగలను అమ్మేశాడట.