: అమరావతిలో సర్కారీ వసతికి దరఖాస్తుల వెల్లువ!
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నుంచి పాలన సాగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అక్కడే ఏర్పాటైన తాత్కాలిక సచివాలయంలోనే విధులు నిర్వర్తించేందుకు ఉద్యోగులు తలూపారు, అయితే ఉన్నపళంగా అద్దె ఇళ్లను తీసుకోలేని, తప్పనిసరి పరిస్థితుల్లో ఒంటరిగా ఉండే ఉద్యోగులకు ప్రభుత్వమే వసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు మహిళా ఉద్యోగులకు 6 నెలల పాటు ఉచిత వసతి, పురుష ఉద్యోగులకైతే.... అద్దెను షేర్ చేసుకునే పద్ధతిలో వసతి కల్పించనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వమే ఏర్పాటు చేయనున్న వసతి తమకు కావాలంటూ ఇప్పటికే 326 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నట్లు సమాచారం.