: ఎక్కడ పుట్టావని అడిగి మరీ ఆంధ్రోళ్లకు ఉద్యోగాలిస్తున్న తెలంగాణలోని కంపెనీలు: కోదండరామ్ విసుర్లు


తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని కంపెనీలు వచ్చినా స్థానికులకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వడం లేదని జేఏసీ చైర్మన్ కోదండరామ్ విమర్శించారు. ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలు నిరుద్యోగులను 'ఎక్కడ పుట్టావు?' అని అడుగుతూ, ఆంధ్రోళ్లకు ఉద్యోగాలిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొందని, తెలంగాణ వ్యతిరేకులకే పెద్ద పీట వేస్తున్నారని ఆయన అన్నారు. 'తెలంగాణలో విద్యాభివృద్ధికి ప్రభుత్వ బాధ్యత' అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, 80 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేందుకు అంగీకరిస్తేనే కంపెనీలకు అనుమతులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యా విభాగాన్ని ప్రైవేటీకరించే కుట్ర జరుగుతోందని, అందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని కోదండరామ్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News