: విజయవాడ బహిరంగ సభనుంచి మధ్యలోనే వెళ్లిపోయిన మంత్రి కామినేని
విజయవాడలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరైన ఆంధ్రప్రదేశ్ మంత్రి కామినేని శ్రీనివాస్ సభ మధ్యలోనే వెళ్లిపోయినట్లు సమాచారం. బహిరంగ సభలో మంత్రి కామినేని మాట్లాడుతుండగా పలువురు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తొలగించిన ఆలయాలను వేరే ప్రాంతంలో నిర్మించేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారంటూ మంత్రి కామినేని మాట్లాడుతుండగానే, ఆలయాల కూల్చివేతకు కారణమైన ఎంపీ కేశినేని నాని, కలెక్టర్ క్షమాపణ చెప్పాలంటూ ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో కామినేని అక్కడి నుంచి వెళ్లిపోయారు.