: కంటిని చూపితేనే అన్ లాక్ అయ్యే బయోమెట్రిక్ స్మార్ట్ ఫోన్ 'టీసీఎల్ 560' ... ధర రూ. 7,999


చైనా కేంద్రంగా స్మార్ట్ ఫోన్లను మార్కెటింగ్ చేస్తున్న టీసీఎల్ కార్పొరేషన్, భారత మార్కెట్లో 'టీసీఎల్ 560' పేరిట వినూత్న ఫోన్ ను ఆవిష్కరించింది. ఈ ఫోన్ కంటి బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ ఆధారంగా అన్ లాక్ చేయబడుతుంది. రెటీనా ఆధారిత వ్యవస్థ దీనిలో ప్రత్యేకత, కంటి ముందు స్మార్ట్ ఫోన్ ను ఉంచితే మూడు సెకన్లలో అన్ లాక్ అవుతుంది. మరెవరూ ఫోన్ ను అన్ లాక్ చేయలేరు. ఫింగర్ ప్రింట్ సెన్సార్లు రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో తదుపరి సాంకేతికతను పరిచయం చేస్తూ వచ్చిన దీని ఖరీదు రూ. 7,999 అని, ఈ-కామర్స్ దిగ్గజం అమేజాన్ నుంచి దీన్ని కొనుగోలు చేయవచ్చని కంపెనీ మార్కెటింగ్ డైరెక్టర్ రంజిత్ గోపి వెల్లడించారు. దీనిలో 5.5 అంగుళాల డిస్ ప్లే, ఆండ్రాయిడ్ 5.1 ఆపరేటింగ్ సిస్టమ్, క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ అంతర్గత మెమోరీ, 8/5 ఎంపీ కెమెరాలు ఉంటాయి.

  • Loading...

More Telugu News