: బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్‌కి ఉగ్రవాది నిబ్రాస్ ఇస్లాం వీరాభిమానట..!
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఇటీవల ఉగ్రవాదులు రెచ్చిపోయి 20 మందిని దారుణంగా చంపిన సంగతి తెలిసిందే. అమాయకులను బలిగొన్న ఆ ఉగ్రవాదుల్లో నిబ్రాస్ ఇస్లాం అనే ఇరవై ఏళ్ల యువకుడు ఉన్నాడు. అయితే, ఈ ఉగ్రవాది బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్కు వీరాభిమాని అని తెలిసింది. నిబ్రాస్ ఇస్లాం ఒకసారి శ్రద్ధాకపూర్‌ని కలిసినప్పుడు సోషల్ మీడియా ద్వారా పట్టరాని ఆనందాన్ని వ్యక్తం చేశాడట. ఆమెతో ఓ ఫోటోను దిగి పోస్ట్ చేస్తూ ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. ఈ అంశం ఫేస్‌బుక్‌లో నిబ్రాస్ ఇస్లాం చేసిన పోస్ట్‌ల ద్వారా బయటపడింది. తన అభిమాన నటి శ్రద్ధాకపూర్ చేతిని తాను పట్టుకున్న సందర్భం తనకు ఎంతగానో ఆనందాన్ని ఇచ్చినట్లు ఫేస్‌బుక్‌లో పేర్కొన్నాడు.