: ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి స్వల్ప గుండెపోటు


కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ నేత, నంద్యాల శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి నిన్న రాత్రి స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయన్ను సురక్ష ఎమర్జెన్సీ ఆసుపత్రిలో చేర్చి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ఆదివారం కర్నూలులో జరిగిన ఇఫ్తార్ విందుకు భూమా హాజరుకాగా, అక్కడి అభిమానులు, కార్యకర్తలు భారీ ఎత్తున మందుగుండు సామాగ్రి కాల్చగా, ఆ పొగ పీల్చడం వల్లే ఛాతీలో నొప్పి, శ్వాసకోశ సమస్యలు తలెత్తినట్టు తెలుస్తోంది. భూమాకు ఈసీజీ, స్కానింగ్ చేసిన వైద్యులు ఆయనకు ప్రమాదమేమీ లేదని వెల్లడించారు. హైదరాబాద్ కు వెళ్లే ముందు మీడియాతో మాట్లాడిన భూమా, తనకేమీ కాలేదని చెప్పారు.

  • Loading...

More Telugu News