: హైదరాబాదులో 'రాహ్ గిరి'!... బెజవాడలో ‘హ్యాపీ సండే’!


ఆదివారం సెలవు దినం. ఆ రోజున హైదరాబాదు చుట్టూ విశాలంగా పరుచుకున్న ఔటర్ రింగ్ రోడ్డుపై జనమంతా చేరిపోతారు. ఆటపాటలతో సందడి చేస్తారు. చిత్ర, విచిత్రమైన క్రీడలను ఆడతారు. డీజేలు హోరెత్తించే పాటలకూ కాలు కదుపుతారు. పిల్లలతో కలిసి అక్కడికి వచ్చే పెద్దలు చేస్తున్న ఈ సందడికి ‘రాహ్ గిరి’ అనే పేరు ఉంది. ఇటీవల రాహ్ గిరిలో పాలుపంచుకుంటున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ నవ్యాంధ్రకు పొలిటికల్ కేపిటల్ గా మారింది. ఇక శాశ్వత రాజధాని లేని నేపథ్యంలో ఆ నగరం రాష్ట్రానికి పాలనా కేంద్రంగానూ మారింది. ఎప్పుడైతే రాజధానిగా అనధికార హోదా వచ్చిందో... అప్పుడే ఆ నగరంలో మార్పులు వచ్చేశాయి. హైదరాబాదులో రాహ్ గిరి తరహాలో బెజవాడలో ‘హ్యాపీ సండే’ ఎంట్రీ ఇచ్చింది. ప్రతి ఆదివారం నగరంలోని బందరు రోడ్డులో నిర్వహిస్తున్న హ్యాపీ సండేలో జనం సందడి చేస్తున్నారు. రాహ్ గిరి కంటే కూడా హై ఓల్టేజీలో సంబరాలకు తెర లేచింది. ఇందులో భాగంగా నిన్న జరిగిన హ్యాపీ సండేలో నగరంలోని సిద్ధార్థ కాలేజీకి చెందిన అమ్మాయిలు సరికొత్త జోష్ పుట్టించారు. డప్పులు చేతపట్టుకుని చిందేసిన అమ్మాయిలు అక్కడికి పిల్లాపాపలతో వచ్చిన జనంలో ఉత్సాహాన్ని నింపారు.

  • Loading...

More Telugu News