: గుర్రం బొమ్మ తలలో 35 కిలోల కొకైన్!
మూడడుగుల గుర్రపు బొమ్మ తలలో సుమారు 35 కిలోల కొకైన్ (మాదకద్రవ్యం)ను తరలిస్తుండగా న్యూజిలాండ్ అధికారులు పట్టుకున్నారు. మెక్సికో నుంచి న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ కు తరలిస్తున్న ఈ కొకైన్ విలువ సుమారు పది మిలియన్ డాలర్లు ఉంటుందని అధికారులు చెప్పారు. ఇద్దరు మెక్సికన్ పౌరులను, కొకైన్ ఉన్న గుర్రపు తల బొమ్మను స్వాధీనం చేసుకున్నామన్నారు. న్యూజిలాండ్ చరిత్రలోనే ఇంత భారీ మొత్తంలో కొకైన్ పట్టుకోవడం ఇదే ప్రథమమని ఒక అధికారి చెప్పారు.