: ఏపీ సీఎంను కలిసిన సాయి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు.. కిడ్నాపర్ల చెర నుంచి విడిపించాలని వేడుకోలు
నాలుగు రోజుల క్రితం నైజీరియాలో కిడ్నాప్‌నకు గురైన సివిల్ ఇంజినీర్ ఎం.సాయిశ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. శనివారం విశాఖపట్నంలో సీఎంను కలిసిన వారు తమ ఆవేదనను తెలియజేశారు. కిడ్నాప్ జరిగి నాలుగు రోజులైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి తమకు ఎటువంటి సమాచారం లేదన్నారు. ఈ విషయంలో చొరవ తీసుకుని సుష్మాస్వరాజ్‌తో మాట్లాడి శ్రీనివాస్‌ను క్షేమంగా భారత్ రప్పించే ఏర్పాట్లు చేయాలని శ్రీనివాస్ భార్య శ్రీలత ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. కాగా ఇంజినీర్‌ను కిడ్నాప్ చేసింది ఉగ్రవాదులు కాదని, స్థానిక క్రిమినల్ గ్యాంగులని భారత ప్రభుత్వం పేర్కొంది. శ్రీనివాస్‌ను కిడ్నాపర్ల చెరనుంచి విడిపించేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలు చేపడతామని సీఎం తమకు హామీ ఇచ్చినట్టు శ్రీలత పేర్కొన్నారు. కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌తోపాటు ఇతర అధికారులతో కూడా మాట్లాడతానని చంద్రబాబు చెప్పారన్నారు.