: పాతబస్తీలో అరెస్టయిన వారికి న్యాయసాయం చేస్తే తప్పేంటి?: బీజేపీకి కౌంటర్ ఇచ్చిన అసదుద్దీన్ ఒవైసీ
హైదరాబాదులోని పాతబస్తీలో ఐఎస్ఐఎస్ అనుమానిత ఉగ్రవాదులంటూ ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్న ఐదుగురు యువకులకు న్యాయసాయం అందిస్తే తప్పేంటని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఆ ఐదుగురిపై ఆరోపణలను ఎన్ఐఏ రుజువు చేయాలని సవాలు విసిరారు. ఆ ఐదుగురికి కోర్టు న్యాయసాయం అందిస్తుందని అన్నారు. కోర్టు న్యాయసాయం చేసేటప్పుడు లేని అభ్యంతరం, తాను చేస్తే ఎందుకని ఆయన ప్రశ్నించారు. కాగా, ఐఎస్ఐఎస్ తీవ్రవాదులకు ఎంపీ హోదాలో వున్న అసదుద్దీన్ న్యాయసాయం ఎలా చేస్తారని బీజేపీ నేత ప్రభాకర్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే.