: 5 వేల కోట్లు కావాలంటూ అరుణ్ జైట్లీకి కేసీఆర్ లేఖ


ఐదు వేల కోట్ల రూపాయలు కావాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమానికి కేంద్రం నుంచి 5 వేల కోట్ల రూపాయల నిధులు కావాలంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు. మిషన్ కాకతీయ విషయంలో నీతి ఆయోగ్ సిఫారసులను కూడా ఆయన ఉదాహరించారు. అలాగే తెలంగాణలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలంటూ ఆయన లేఖలో కోరారు.

  • Loading...

More Telugu News