: ఆదిలాబాద్‌లో దారుణం.. యువ‌తిని గొంతుకోసి చంపిన యువ‌కుడు


ఆదిలాబాద్ జిల్లా భైంసాలోని గోపాల్‌న‌గ‌ర్‌లో దారుణం చోటు చేసుకుంది. పెళ్లికి నిరాక‌రించింద‌ని ఓ యువ‌తిని మ‌హేశ్ అనే యువ‌కుడు దారుణంగా చంపేశాడు. యువ‌తి షాపుకి వెళుతోన్న స‌మ‌యంలో అంద‌రి ముందు మ‌హేశ్ ఆ యువ‌తి గొంతు కోసి హ‌త్య‌చేశాడు. అనంత‌రం అక్క‌డి నుంచి పారిపోయాడు. ఈరోజు మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల స‌మ‌యంలో ఈ దారుణం చోటు చేసుకుంది. మృతురాలి పేరు సంధ్య అని స‌మాచారం. అంద‌రూ చూస్తుండ‌గా న‌డిరోడ్డుపై హ‌త్య జ‌ర‌గ‌డం స్థానికంగా క‌ల‌క‌లం రేపింది. సంధ్య పొరుగింట్లోనే మ‌హేశ్ నివాసం ఉంటున్న‌ట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News