: ఆరోగ్యశ్రీ సేవలకి అడ్డుతగలొద్దు.. హైదరాబాద్‌లో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
ప్రభుత్వం బకాయిలు చెల్లించడం లేదని తెలంగాణలో డాక్లర్లు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసిన అంశంపై కాంగ్రెస్ కార్యకర్తలు ఈరోజు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ కోఠిలోని డీఎంఈ కార్యాలయం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. పేదవారికి కనీసం వైద్యాన్ని కూడా అందించలేని ప్రభుత్వం బంగారు తెలంగాణ ఎలా సాధిస్తుందని కాంగ్రెస్ కార్యకర్తలు ప్రశ్నించారు. పేదవాడి గోడుని ప్రభుత్వం వినిపించుకోదా..? అని ప్రశ్నించారు. ఆరోగ్య శ్రీ బిల్లు బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేదంటే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ తీరుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.