: గన్‌పార్క్ వద్ద న్యాయవాదుల నిరసన.. జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిక
వెంటనే హైకోర్టును విభజించాలని, న్యాయాధికారులు, ఉద్యోగులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద తెలంగాణ న్యాయవాదులు, రిటైర్డ్ న్యాయాధికారులు ఈరోజు మౌనప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. తమ డిమాండ్లపై సానుకూల ప్రకటన చేస్తే వెంటనే విధుల్లో చేరుతామని తెలిపారు. లేదంటే తమ ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయని పేర్కొన్నారు. ఇందిరా పార్క్ వద్ద నిన్న పెద్ద ఎత్తున ఆందోళన చేసినట్లే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కూడా ఆ స్థాయిలో నిరసన తెలుపుతామన్నారు. పార్లమెంట్ భవనాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.