: సాగర నగరంలో నేడు అరుదైన ఈవెంట్!... నైట్ మారథాన్ ను ప్రారంభించనున్న చంద్రబాబు!


సాగర నగరం విశాఖ... ఏపీ ఎకనమికల్ కేపిటల్ గా ఎదుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదేమో. ఎందుకంటే ఇటీవల విశాఖ కేంద్రంగా ఏపీ ప్రభుత్వం నిర్వహించిన వాణిజ్య సదస్సులో మూడు రోజుల్లోనే రూ.5 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక సంస్థలు ముందుకు వచ్చాయి. ఇదే జోరును కొనసాగించేందుకు నేడు విశాఖలో ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టనుంది. దేశంలో ఈ తరహాలో జరుగుతున్న తొట్ట తొలి ఈవెంట్ గా ఈ కార్యక్రమం రికార్డులకెక్కనుంది. ‘వైజాగ్ స్టీల్ బే మారథాన్’ పేరిట ఆర్కే బీచ్ నుంచి గీతం వర్సిటీ దాకా జరగనున్న ఈ పరుగును టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేటి రాత్రి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్రాండ్లకు చెందిన ఖరీదైన కార్లు ఈ మారథాన్ లో కనువిందు చేయనున్నాయి. 3, 5, 10, 21 కిలో మీటర్ల విభాగాలుగా జరగనున్న ఈ మారథాన్ లో పాలుపంచుకునేందుకు ఇప్పటికే 4 వేల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇక మారథాన్ సందర్భంగా సాగర తీరం వెంట సంగీతం మారు మోగనుంది. అంతేకాకుండా అక్కడ ‘లగ్జరీ విత్ హాట్ థీమ్’ పేరిట ఫిక్కీ, ద ఇండియన్ లగ్జరీ షో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఎక్స్ పోలో ప్రపంచంలోని ఖరీదైన బ్రాండ్లకు చెందిన పలు వస్తువులు ప్రదర్శనకు రానున్నాయి.

  • Loading...

More Telugu News