: బాలయ్య బలం ఆయన ఫ్యాన్సే!.. కారు ప్రమాద స్థలంలో అభిమానుల ప్రత్యేక పూజలు!


టాలీవుడ్ టాప్ హీరో, అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ బలమెంతో తెలిపే ఓ ఘటన నేటి ఉదయం చోటుచేసుకుంది. ఇటీవల తన సొంత నియోజకవర్గ పర్యటనకు వెళ్లిన బాలయ్య రెండు రోజుల క్రితం హైదరాబాదు తిరుగుపయనంలో భాగంగా బెంగళూరు వెళుతూ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. సెల్ఫ్ డ్రైవింగ్ లో బాలయ్య... కారు అద్దంపై పడ్డ పూలమాలతో రోడ్డు కనిపించక కారును డివైడర్ ఎక్కించారు. ఈ సందర్భంగా కారు టైర్ బరస్ట్ అయ్యింది. అయితే ఈ ప్రమాదంలో బాలయ్యకు చిన్న గాయం కూడా కాలేదు. ఈ ప్రమాదం నుంచి బాలయ్య బయటపడటంతో ఊపిరి పీల్చుకున్న ఆయన అభిమానులు నేటి ఉదయం ప్రమాద స్థలి వద్దకు వెళ్లారు. బాలయ్యను ప్రమాదం నుంచి తప్పించిన ఆ ప్రాంతంలో వారు ప్రత్యేకంగా పూజలు చేశారు.

  • Loading...

More Telugu News