: ఐదుగురిలో ముగ్గురు నాన్ లోకల్స్!... వ్యాపారం పేరిట వచ్చి ఇద్దరిని ‘ఉగ్ర’బాట పట్టించిన వైనం!


భాగ్యనగరి హైదరాబాదులో పెను విధ్వంసం సృష్టించేందుకు రంగంలోకి దిగిన ఐదుగురు ఉగ్రవాదుల్లో ముగ్గురు హైదరాబాదీలు కాదట. కేవలం ఇద్దరు మాత్రమే హైదరాబాదుకు చెందిన యువకులని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు నిర్ధారించారు. ఉగ్రవాదుల్లో నాన్ లోకల్స్ గా తేలిన ముగ్గురు యువకులే ఈ ఇద్దరు లోకల్ కుర్రాళ్లను ఉగ్రవాదులుగా మార్చివేశారని కూడా అధికారులు గుర్తించారు. ఈ మేరకు నిన్న ఎన్ఐఏకు చెందిన ఓ అధికారి మీడియా ప్రతినిధులకు పలు కీలక విషయాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చెందిన ఈ వ్యక్తులు వ్యాపారం పేరిట హైదరాబాదుకు వచ్చి ఉగ్రవాద బీజాలు వేస్తున్నారు. గతంలో చోటుచేసుకున్న పలు ఉగ్రవాద దాడుల్లోనూ ఈ తరహాలోనే బయటి వ్యక్తులే నరమేధం సృష్టించారు. తాజా ఘటనలో ఇతర రాష్ట్రాలకు చెందిన ముగ్గురు యువకులు వ్యాపారం పేరిట పాతబస్తీలో దిగారు. వ్యాపారులమనే చెప్పుకున్న సదరు వ్యక్తులు మెల్లగా నివాసం ఏర్పరచుకున్నారు. ఆ తర్వాత స్థానిక యువతను తమ వైపు తిప్పుకునే యత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఇద్దరు యువకులు వారి ప్రలోభాలకు లొంగి ఉగ్రవాదులుగా మారారు.

  • Loading...

More Telugu News