: తెలంగాణ లాయర్ల భవిష్యత్ కార్యాచరణ ఇదే!


ఆంధ్రప్రదేశ్ హైకోర్టును విభజించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాటపట్టిన తెలంగాణ న్యాయవాదులు తమ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో లాయర్ల జేఏసీ నేతలు భవిష్యత్ కార్యాచరణను హైదరాబాదులో ప్రకటించారు. ఈ నెల 3న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి హైకోర్టు విభజన ఆవశ్యకతను వివరించాలని నిర్ణయించారు. 4న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. 5న సర్వమత ప్రార్థనలు నిర్వహిస్తామన్నారు. 7న తెలంగాణ వ్యాప్తంగా రాస్తారోకో చేపడతామని, ఆ సందర్భంగా జైల్‌ భరో కూడా నిర్వహిస్తామని వారు వెల్లడించారు. అనంతరం 8న హైకోర్టు విభజనకు అనుకూలంగా ప్రజల నుంచి సంతకాల సేకరణ చేపట్టనున్నామని వారు ప్రకటించారు.

  • Loading...

More Telugu News