: అమరావతిలో హైకోర్టు అక్కర్లేదా?: చంద్రబాబును ప్రశ్నించిన కేటీఆర్


హైకోర్టు విషయమై ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు. అమరావతిలో సచివాలయాన్ని నిర్మించుకుని పరిపాలన ప్రారంభించడం అభినందనీయమని పేర్కొన్న కేటీఆర్, ఏపీ హైకోర్టు అమరావతిలో ఉండాలనే అంశానికి అంత ప్రాధాన్యత లేదా? అని ఆ ట్వీట్ లో ఆయన ప్రశ్నించారు. నవ్యాంధ్ర సచివాలయం వెలగపూడిలో ప్రారంభం రోజున సీఎం చంద్రబాబు చేసిన ట్వీట్ ను ప్రస్తావిస్తూ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు విభజనపై ప్రస్తుతం తెలంగాణలో ఆందోళనలు జరుగుతున్న సమయంలో కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

  • Loading...

More Telugu News