: భయపడకండి...లోకల్ గ్యాంగ్ కిడ్నాప్ చేసింది: సాయి శ్రీనివాస్ భార్యకు సుష్మ ఫోన్


నైజీరియాలో కిడ్నాపైన ఇద్దరు భారతీయ ఇంజనీర్ల గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. నైజీరియాలోని జిబోకోలోని డంకోట సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఇద్దరు భారతీయులు విధులకు హాజరయ్యేందుకు వెళుతుండగా కిడ్నాప్ కు గురి కావడం, వారిలో విశాఖపట్టణానికి చెందిన ఇంజనీర్ సాయిశ్రీనివాస్ కూడా వుండడం మనకు తెలిసిందే. దీంతో సాయి శ్రీనివాస్ భార్య లలితకు కేంద్ర మంత్రి సుష్మ ఈ రోజు ఫోన్ చేశారు. వీరిని తీవ్రవాదులు కిడ్నాప్ చేయలేదని, లోకల్ గ్యాంగ్ వీరిని ఎత్తుకెళ్లినట్టు సమాచారం అందుతోందని, కిడ్నాపర్ల బారి నుంచి వీరిని విడుదల చేయించేందుకు అన్ని చర్యలు చేపట్టామని, ఆందోళన చెందాల్సిన పని లేదని మంత్రి ధైర్యం చెప్పారు.

  • Loading...

More Telugu News