: కూల్చడంలో చంద్రబాబును కేసీఆర్ ఆదర్శంగా తీసుకుంటారేమో!: వీహెచ్


కూల్చే విషయంలో చంద్రబాబును కేసీఆర్ ఆదర్శంగా తీసుకుంటారేమోనని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సెటైర్ విసిరారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన వారికి తెలంగాణ ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతూ వారికి మద్దతుగా అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద వీహెచ్ ఈ రోజు మౌనదీక్షకు దిగారు. నోటికి నల్లరిబ్బన్ కట్టుకుని బైఠాయించారు. ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా ఈ నిరసనదీక్షలో పాల్గొన్నారు. అనంతరం వీహెచ్ మాట్లాడుతూ విజయవాడలో ఆలయాల తొలగింపు అంశాన్ని కూడా ప్రస్తావించారు. పుష్కరాల పేరుతో చంద్రబాబు గుళ్లూగోపురాలను కూల్చేస్తూ ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ లో చార్మినార్ పాతదైందని చెప్పి కేసీఆర్ కూడా కూలగొడతారేమోనని..అందుకు బాబును ఆదర్శంగా తీసుకుంటారేమోనని వీహెచ్ అన్నారు.

  • Loading...

More Telugu News