: అడవి ఏనుగు ప్రాణం తీసిన మామిడాకులు!
చెన్నైలో మామిడాకులు తిన్న అడవి ఏనుగు ప్రాణాలు వదిలింది. విరుదనగర్ జిల్లా శ్రీ విల్లిపుత్తూరు సమీపంలోని వత్తిరాయిరుప్పు ఆనకట్ట సమీపంలో కాప్పుకాడు ప్రాంతం వద్ద ఈ విషాద సంఘటన జరిగింది. సుమారు 20 సంవత్సరాల వయస్సున్న అడవి ఏనుగు ఒకటి చనిపోయి ఉండటాన్ని అటవీశాఖ ఉద్యోగులు కనుగొన్నారు. రెండు రోజుల క్రితం మామిడి చెట్లపై క్రిమిసంహారక మందులు చల్లారని, వాటి ఆకులు తిని వుండడం వల్లే అది మరణించి ఉంటుందని అటవీ శాఖాధికారులు భావిస్తున్నారు. వెటర్నరీ వైద్యుల సాయంతో ఆ ఏనుగుకు పోస్టు మార్టం నిర్వహించిన అనంతరం, దానిని ఖననం చేశారు.