: ఉత్తరాఖండ్‌ను ముంచెత్తుతోన్న వర్షాలు.. ధ్వంసమవుతోన్న ఇళ్లు
ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో ఇళ్లు ధ్వంసమవుతున్నాయి. ఒక్కసారిగా ఇళ్లు కుప్పకూలుతుండడంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు, పిడుగుపాటుతో ఆ రాష్ట్రంలో 9 మంది మృతి చెందారు. అలకనందా నది ప్రమాద స్థాయిలో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చమోలీ జిల్లాలో వరదలతో ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయే ప్రయత్నం చేస్తున్నారు. వర్షాల కారణంగా ఏర్పడుతోన్న పరిస్థితులను ఎదుర్కునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.