: ఏపీలో జూన్‌లో సాధార‌ణం కంటే త‌క్కువ వ‌ర్ష‌పాతం న‌మోదు


ఈ ఏడాది జూన్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సాధార‌ణం కంటే 11 శాతం త‌క్కువ వ‌ర్ష‌పాతం న‌మోదయింద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు పేర్కొన్నారు. కాగా, ప‌శ్చిమ మ‌ధ్య బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం కొన‌సాగుతోంద‌ని తెలిపారు. వాయ‌వ్య బంగాళాఖాతానికి ఆనుకొని వున్న ఈ అల్పపీడనం ఉత్త‌ర కోస్తాంధ్ర, ద‌క్షిణ ఒడిశా తీరాల‌కు ఆనుకొని కేంద్రీకృత‌మైంద‌ని చెప్పారు. అల్ప‌పీడ‌నానికి అనుబంధంగా ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం కొన‌సాగుతోంద‌ని, దీని ప్ర‌భావంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నేడు ప‌లుచోట్ల వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలున్నాయ‌ని పేర్కొన్నారు. కోస్తాంధ్ర‌లో ఒక‌ట్రెండు చోట్ల భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News