: పాక్ నటుడిపై దుండగుల కాల్పులు
ప్రముఖ పాకిస్థానీ నటుడు, యాంకర్, మ్యూజిషియన్ నదీమ్ జాఫ్రిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. కరాచీలో ఈ సంఘటన జరిగింది. స్నేహితులతో కలిసి తన నివాసం ఎదుట కూర్చుని ఉండగా బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు తనపై కాల్పులు జరిపారని, అయితే ఎటువంటి బుల్లెట్ గాయాలు తగలకుండా బయటపడ్డానని నదీమ్ జాఫ్రీ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన నేపథ్యంలో నదీమ్ మాట్లాడుతూ, అల్లా దయ వల్ల తాను ప్రాణాలతో బయటపడ్డానని, ఇటువంటి సంఘటన తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని, ఇదో భయంకరమైన అనుభవమని అన్నాడు. తనకు ప్రాణహాని ఉందని, తనకు భద్రత కల్పించాలని అక్కడి ప్రభుత్వానికి నదీమ్ జాఫ్రీ విజ్ఞప్తి చేశాడు.