: నేను నోరు విప్పితే దేశం షేక్ అవుతుంది: మహారాష్ట్ర మాజీ మంత్రి ఏక్ నాథ్ ఖడ్సే సంచలన వ్యాఖ్యలు


తాను నోరు తెరిస్తే దేశం మొత్తం షేకైపోతుందని మహారాష్ట్ర మాజీ మంత్రి ఏక్ నాథ్ ఖడ్సే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలోని జల్ గావ్ లో మద్దతుదారులతో ఆయన మాట్లాడుతూ, అవినీతి ఆరోపణల పేరుతో తాను రాజీనామా చేసినప్పటికీ, తాను నోరు తెరిస్తే దేశం మొత్తం షేక్‌ అవుతుందని అన్నారు. మహారాష్ట్ర కేబినెట్‌ లో కీలక పాత్ర పోషించిన ఖడ్సే, ఎన్నికలకు ముందు బీజేపీ, శివసేన మధ్య విభేదాలకు తానే కారణమని, తన కారణంగానే ఈ రెండు పార్టీలు విడిపోయాయని అన్నారు. తాను అలా చేయడం వల్లే మహారాష్ట్రలో బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రి కాగలిగాడని ఆయన తెలిపారు. లేని పక్షంలో సీఎం పీఠం శివసేనకు దక్కేదని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News