: కత్తిపట్టి 'అల్లాహో అక్బర్' అనే వారికి ఇస్లాంతో సంబంధం లేదు: మెహబూబా ముప్తీ
కత్తి పట్టుకుని అల్లా హో అక్బర్ అనేవారికి ఇస్లాంతో సంబంధం లేదని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ స్పష్టం చేశారు. జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం స్వీకారం చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ, ఇస్లాం పేరుతో ఉగ్రవాద చర్యలకు పాల్పడేవారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఇస్లాం పేరుతో అమాయక పౌరులను చంపడం సరికాదని ఆమె హితవు పలికారు. ఇలాంటి చర్యలను చూసి ముస్లింగా సిగ్గుపడుతున్నానని ఆమె గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేసిన ఆమె, ఇస్లాం అంటే శాంతి అని...ఉగ్రవాదం, హింస కాదని స్పష్టం చేశారు.