: ప్రత్యేక హోదా పోరాటానికి సీఎం చంద్రబాబు సిద్ధం కావాలి: చలసాని శ్రీనివాస్


నవ్యాంధ్రకు అన్యాయం జరగకముందే ప్రజలందరూ ఉద్యమించాలని ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాటానికి సిద్ధపడాలని అన్నారు. ఏపీకి రూ.70 వేల కోట్ల ప్యాకేజీతో సరిపెట్టాలని కేంద్రం చూస్తోందని అన్నారు. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో రేపు చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారని, ఇప్పటికే ఇస్తామని చెప్పిన రూ.7 వేల కోట్లతో పాటు మరో రూ.27 వేల కోట్ల క్యాష్ ఇస్తామని చెప్పే విధానంతో ఈ సమావేశంలో కుట్ర చేయనున్నారని ఆరోపించారు. విభజన హామీలన్నింటిని కేంద్రం అమలు చేయాలని, కేసులు పెట్టి ఉద్యమాన్ని అణచాలని కేంద్రం చూస్తోందని విమర్శించారు. ప్రత్యేక హోదా పోరాటానికి సీఎం చంద్రబాబు కూడా సిద్ధం కావాలని శ్రీనివాస్ అన్నారు.

  • Loading...

More Telugu News