: హైదరాబాద్ ను జల్లెడ పడుతున్న స్పెషల్ పార్టీ బృందాలు, పోలీసులు


హైదరాబాద్ లో మారణహోమం సృష్టించేందుకు ఉగ్రవాదులు భారీ ప్రణాళికలు రూపొందించినట్టు బహిర్గతమైన వేళ, స్పెషల్ పార్టీ బృందాలు, పోలీసులు నగరాన్ని జల్లెడ పడుతున్నాయి. పలు కూడళ్లలో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఐటీ కారిడార్ లోని కంపెనీలు ఉగ్రవాదుల టార్గెట్ గా వార్తలు రావడంతో మాదాపూర్ డీసీపీ కార్తికేయ నేతృత్వంలోని పోలీసులు అన్ని ఐటీ కంపెనీలు, మాల్స్, మల్టీప్లెక్స్ లు, ఫంక్షన్ హాల్స్, రెస్టారెంట్లలో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు సందర్శకులను నిలిపివేశారు. కేవలం ప్రయాణానికి టికెట్ ఉన్నవారిని మాత్రమే లోపలకు అనుమతిస్తున్నారు. పలు కూడళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News