: కుమార సంగక్కారపై నిప్పులు చెరుగుతున్న సచిన్ అభిమానులు!


సమకాలీన క్రికెట్ ప్రపంచానికి దేవుడిగా భావించే సచిన్ టెండూల్కర్ అభిమానులు, శ్రీలంక క్రికెట్ మాజీ స్టార్ ఆటగాడు కుమార సంగక్కారపై నిప్పులు చెరుగుతున్నారు. లంక మాజీ కెప్టెన్ అయిన సంగక్కార, 'ఆల్ టైం ఎలెవన్' పేరిట తన ఫేవరెట్ జట్టును ప్రకటిస్తూ, ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశాడు. దీనిలో భారత్ కు చెందిన మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ పేరును ప్రకటించాడు. ఇదే సచిన్ అభిమానుల కోపానికి కారణమైంది. తన హయాంలో 100 అంతర్జాతీయ సెంచరీలు కొట్టిన సచిన్ పేరు ఈ జాబితాలో లేనందుకు సంగక్కారను తిట్టి పోశారు. అతను ఓ సామాన్య ఆటగాడినేనని నిరూపించుకున్నాడని, లంకలో క్రికెట్ దిగ్గజాన్ని కాదని ఒప్పుకున్నాడని వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన ఎంపిక చేసిన చాలా మందికన్నా సచిన్ ఎంతో మెరుగైన ఆటగాడని, ఇదసలు ఎవరి దృష్టిలోనూ 'ఆల్ టైం ఎలెవన్' అనిపించుకోబోదని విమర్శించారు. భారత ఆటగాళ్లంటే లంకకు ఎప్పుడూ చులకనేనని, అతనికి ఇండియన్ బ్రాండ్లతో ఉన్న డీల్స్ ముగిసిపోవడంతోనే, అందరి దృష్టినీ ఇలా చీప్ పబ్లిసిటీతో ఆకర్షించాలని చూస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఇక ఇంటికెళ్లి మందు కొట్టి పడుకోవాలని, సంగక్కారపై ఉన్న గౌరవం స్థానంలో ద్వేషం మొదలైందని, 'ఈస్ట్ ఆర్ వెస్ట్.. సచిన్ ఈజ్ ది బెస్ట్' అని... ఇలా సాగుతోంది ట్వీట్ల పరంపర.

  • Loading...

More Telugu News