: కశ్మీర్లో తీవ్రవాదులకు 'ఏకే-56 తుపాకీ' ఇచ్చిన బీజేపీ నేత!


శ్రీనగర్ లో తుపాకీ దొంగతనం కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఇక్కడి బీజేపీ నేత గులాం మహమ్మద్ చోపాన్ స్వయంగా మిలిటెంట్లకు అత్యాధునిక ఏకే-56 రైఫిల్స్ ఇచ్చినట్టు తేల్చిన పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం చోపాన్ వ్యక్తిగత సెక్యూరిటీ నుంచి అనుమానిత తీవ్రవాదులు సర్వీస్ రైఫిల్ ను లాక్కెళ్లినట్టు ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసును సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. ఆపై విచారించగా, ఇది ఇంటి దొంగల పనేనని తేలింది. తన ఇంట్లోకి దూసుకువచ్చిన మిలిటెంట్లు, కాపలాగా ఉన్న బషీర్ అహ్మద్ పై దాడికి దిగి, అతని గన్ తీసుకుని పారిపోయారని చోపాన్ చేసిన ఫిర్యాదు అవాస్తవమని కనిపెట్టిన పోలీసులు, అసలు ఆ సమయంలో బషీర్ విధుల్లోనే లేడని, అతని తుపాకిని మాత్రం చోపాన్ ఇంటి వద్ద ఉంచారని తెలిపారు. ఆయన ఇంటికి కొంతమంది సందర్శకులు రాగా, తుపాకిని వారికి ఇచ్చి పంపినట్టు స్పష్టం చేశారు. ఆపై అనుమానిత మిలిటెంట్లు బైకులపై పారిపోయారని, వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. చోపాన్ ను ప్రశ్నించి మరిన్ని వివరాలు రాబడతామని వివరించారు.

  • Loading...

More Telugu News