: అదంతా రాజకీయ దురుద్దేశమే!... ఆరోపణలను ప్రభుత్వం నిరూపించలేదంటున్న రాబర్ట్ వాద్రా!


కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా మరోమారు బీజేపీ సర్కారుపై ధ్వజమెత్తారు. రాజకీయ దురుద్దేశాలతోనే తనను బీజేపీ సర్కారు టార్గెట్ చేస్తోందని ఆయన విరుచుకుపడ్డారు. ప్రభుత్వం ఎంతమేర యత్నించినా తనపై చేసిన ఆరోపణలను నిరూపించలేదని ఆయన చెప్పారు. 'అసలు అక్రమాలు జరిగి ఉంటే కదా... బీజేపీ సర్కారు నన్ను దోషిగా నిలబెట్టేది?' అంటూ ఆయన ఓ రేంజిలో ఫైరయ్యారు. ఈ మేరకు నేటి ఉదయం ఆయన తన ఫేస్ బుక్ అకౌంట్ లో బీజేపీ సర్కారుపై ధ్వజమెత్తారు. ‘‘దాదాపు దశాబ్ద కాలంగా నాపై ప్రభుత్వాలు నిందారోపణలు చేస్తున్నాయి. ఆధారం లేకుండా ఏ ఒక్క ఆరోపణను ప్రభుత్వం నిరూపించలేదు. అయినా ఆ ఆరోపణలను నిరూపించేందుకు ఏమీ లేదు. రాజకీయ దురుద్దేశాల కోసమే నన్ను వాడుకుంటున్నారు. ఇదంతా నాకు తెలుసు. ఎవరేం చేసినా నిజాయతీతో నేను తలెత్తుకునే జీవిస్తాను’’ అని రాబర్ట్ వాద్రా సదరు ఫేస్ బుక్ పోస్ట్ లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News