: బొమ్మను చూసి మహిళ అనుకున్నారు.. ఉరేసుకుందనుకుని తలుపులు పగలగొట్టారు!


తలుపులు వేసి ఉన్న ఓ రూంలో గాలితో నింపిన ఓ బొమ్మ వేలాడుతూ క‌నిపించింది. ఆ దృశ్యాన్ని కిటికీలోంచి చూసిన స్థానికులు రూంలో మ‌హిళ ఉరివేసుకుంద‌ని భావించారు. విష‌యాన్ని పోలీసులకి తెలిపారు. పోలీసులూ మొదట ఆ బొమ్మ‌ను చూసి మ‌హిళే అనుకున్నారు. వెంటనే త‌లుపులు ప‌గుల‌కొట్టారు. తీరా రూంలోకి వెళ్లి చూసి.. వేలాడుతూ ఉన్న‌ది మహిళ కాదు, బొమ్మ అని తెలుసుకొని పోలీసుల‌తో పాటు స్థానికులు తెల్లమొహం వేశారు. ఈ సంఘ‌ట‌న నెద‌ర్లాండ్‌ తూర్పు ఆమ్స్టర్డ్యామ్లోని ఓ అపార్ట్మెంట్లో చోటు చేసుకుంది. బొమ్మ అచ్చం మ‌హిళ‌లాగే క‌నిపించింద‌ని, అంతేకాక వేలాడుతూ ఉండ‌డంతో మ‌హిళ ఆత్మ‌హ‌త్య చేసుకుని ఉంటుంద‌ని తాము భావించిన‌ట్లు స్థానికులు చెప్పారు. రూంలో వేలాడుతూ క‌నిపించింది మ‌హిళ కాక‌పోవ‌డంతో స్థానికులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అక్క‌డ‌ సెక్స్ వర్క్కు చట్టబద్ధత ఉండ‌డంతో షాపుల్లో ఇలాంటి సెక్స్ టాయ్స్ ని విక్ర‌యిస్తారు. అయితే ఉరివేసుకున్న‌ట్లు బొమ్మ‌ను ఎందుకు వేలాడ‌దీశారు..? అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

  • Loading...

More Telugu News