: నావికాదళ అమ్ముల పొదిలో వరుణాస్త్రం... నేవీ మరింత శక్తిమంతం!


జలయుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు, భారత నావికాదళానికి ఎంతగానో ఉపకరిస్తుందని భావిస్తున్న ఎలక్ట్రానిక్ టోర్పెడో 'వారుణాస్త్ర'ను డీఆర్డీవో జాతికి అంకితం చేసింది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సమక్షంలో వారుణాస్త్ర అధికారికంగా ఇండియన్ నేవీకి అందింది. దాదాపు 1,200 కిలోల బరువుండే ఈ క్షిపణిని భూ ఉపరితలం లేదా జలాంతర్గాముల నుంచి ప్రయోగించవచ్చు. 250 కిలోల పేలుడు పదార్థాలతో 40 నాటికల్ మైళ్ల వేగంతో దూసుకెళుతూ, సముద్రంలో దాగున్న సబ్ మెరైన్లను ఇది ధ్వంసం చేయగలుగుతుంది. దీని ఖరీదు రూ. 10 కోట్ల నుంచి రూ. 12 కోట్ల వరకూ ఉంటుంది. ఈ క్షిపణిని విదేశాలకు విక్రయించనున్నామని, వియత్నాం ఈ తరహా క్షిపణులకు ఆర్డర్ ఇచ్చే అవకాశాలున్నాయని రక్షణ మంత్రి వెల్లడించారు. నావికాదళ చరిత్రలో ఇదో కీలక ఘట్టమని, ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన నావీ ఉన్న దేశాల్లో ఇండియా కూడా చేరినట్లయిందని అడ్మిరల్ సునీల్ లాంబా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News