: హైదరాబాదు ఐఐటీకి బూస్ట్... రూ.2,075 కోట్లు విడుదల చేసిన కేంద్రం


తెలంగాణలోని మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డి సమీపంలో ఉన్న హైదరాబాదు ఐఐటీకి భారీగా నిధులు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిన్న కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్... హైదరాబాదు ఐఐటీకి ఒకేసారి రూ.2,075 కోట్ల నిధుల కేటాయింపునకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చాలా కాలం క్రితమే ఏర్పాటైన హైదరాబాదు ఐఐటీకి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం సంగారెడ్డి సమీపంలోని కంది గ్రామ పరిసరాల్లో భూమిని కేటాయించింది. అయితే కేంద్రం నుంచి ఆశించిన మేర నిధులు లేని కారణంగా హైదరాబాదు ఐఐటీ తరగతులు అక్కడికి సమీపంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో కొనసాగుతున్నాయి. తాజాగా కేంద్రం ఒకే విడతలో రూ.2,075 కోట్లను విడుదల చేయడంతో త్వరలోనే కంది సమీపంలో హైదరాబాదు ఐఐటీకి కొత్త భవనాల నిర్మాణం ఊపందుకోనుంది.

  • Loading...

More Telugu News