: సాయంత్రం కేంద్ర కేబినెట్ కీలక భేటీ... మంత్రుల స్వీయ నివేదికలపై మోదీ సమీక్ష
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేటి సాయంత్రం మరోమారు మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నిన్న ఉదయం జరిగిన కేబినెట్ భేటీలో మోదీ పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేశారు. తాజాగా నేటి సాయంత్రం నిర్వహించనున్న భేటీకి మంత్రులంతా... తమ పనితీరుకు సంబంధించిన స్వీయ నివేదికలతో రావాలని మోదీ ఆదేశాలు జారీ చేశారు. దీంతో మంత్రులంతా తమ తమ పనితీరుకు సంబంధించిన స్వీయ నివేదికలతో సమావేశానికి రెడీ అవుతున్నారు. మంత్రుల నుంచి నివేదికలు అందుకునే మోదీ వారి పనితీరుపై సమీక్ష చేస్తారు. పనితీరులో వెనుకబడ్డ మంత్రులకు త్వరలో జరగనున్న కేబినెట్ విస్తరణలో ఉద్వాసన తప్పదన్న వార్తల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.