: నేను క్షేమం... నాన్నగారి ఆశీస్సులు, అభిమానుల ప్రేమ కాపాడాయి: బాలయ్య


తాను క్షేమంగా ఉన్నానని ప్రముఖ నటుడు బాలకృష్ణ తెలిపారు. హైదరాబాదులోని నివాసానికి చేరుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ, నాన్నగారి ఆశీస్సులు, అభిమానుల ప్రేమ తనను కాపాడాయని అన్నారు. కారును తానే నడుపుతున్నానని ఆయన చెప్పారు. మధ్యలో అద్దంపై పూలు పడడంతో రోడ్డు సరిగా కనిపించలేదని అన్నారు. ఇంతలో టైర్ పంక్చర్ కావడంతో డివైడర్ ను ఢీ కొట్టానని ఆయన తెలిపారు. తనకు ఏమీ కాలేదని క్షేమంగా ఉన్నానని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News