: బాలకృష్ణకు తృటిలో తప్పిన ప్రమాదం
సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు తృటిలో ప్రమాదం తప్పింది. రహదారిపై జరిగిన ప్రమాదం నుంచి ఆయన ఈరోజు బయటపడ్డారు. అనంతపురంలోని హిందూపురం నుంచి బెంగుళూరు వెళుతున్న సమయంలో బాలకృష్ణ ప్రయాణిస్తోన్న వాహనం డివైడర్‌ను ఢీ కొట్టింది. దీంతో ఆయన ప్రయాణిస్తోన్న వాహనం దెబ్బతిన్నట్లు సమాచారం. బాలకృష్ణ క్షేమంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. మరో వాహనంలో ఆయన బెంగుళూరు వెళ్లారు.