: హైదరాబాద్ కార్పోరేటర్స్కి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు, న్యాయమూర్తులకు ఇస్తే తప్పేంటి?: తెలంగాణ బీజేపీ నేత రఘునందన్
తెలంగాణలో రెండు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే బాధపడని తెలంగాణ సీఎం కేసీఆర్‌కి హైకోర్టు విభజన అంశంపై మనస్తాపం కలిగిందా..? అని బీజేపీ నేత రఘునందన్ విమర్శించారు. ఈరోజు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మల్లన్న సాగర్‌లో భూనిర్వాసితుల ఆందోళన అంశాన్ని మరిపించడానికే హైకోర్టు విభజనపై కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. న్యాయమూర్తులకు ఆప్షన్స్ ఇస్తే తప్పేంటని రఘునందన్ దుయ్యబట్టారు. హైదరాబాద్ కార్పోరేటర్స్కి ఆప్షన్స్ ఇవ్వలేదా..? అని ఆయన ప్రశ్నించారు. సమస్య పరిష్కారంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించాలని ఆయన అన్నారు. హైకోర్టు విభజనపై ఢిల్లీలో దీక్ష చేస్తానని చెబుతోన్న సీఎం కేసీఆర్ తన దీక్షను ఎప్పుడు చేస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. భూనిర్వాసితులకు పరిహారం అందించే అంశంపై హరీశ్‌రావు రాద్ధాంతం చేస్తున్నారని, దానికి సంబంధించిన 123 జీవో మంచిదా లేక 2013 చట్టం మంచిదో చర్చించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారా..? అని రఘునందన్ దుయ్యబట్టారు.