: తెలంగాణ సెంటిమెంటును క్యాష్ చేసుకునేందుకు ఇంకా ప్రయత్నిస్తున్నారు: టీడీపీ నేత సోమిరెడ్డి ఫైర్
న్యాయవాదులు పెద్దఎత్తున ఆందోళన నిర్వహిస్తోన్న అంశంపై ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలంగాణ సెంటిమెంట్ ను క్యాష్ చేసుకునేందుకు నేతలు ఇంకా ప్రయత్నిస్తున్నారు’ అని విమర్శించారు. ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్‌లో తమకు 10 సంవత్సరాలు ఉండే హక్కు ఉందని ఆయన పేర్కొన్నారు. న్యాయవాదుల అంశాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకునే ప్రయత్నం చేయొద్దని అన్నారు. తెలంగాణ సెంటిమెంట్‌ను ఇంకా ఎన్నాళ్లు వాడుకుంటారని ఆయన ప్రశ్నించారు.